26 ఆగస్టు, 2011

నీ వొస్తావ్ ..!!



"గుండె బాధతో నిండినపుడు ,

మాట పెగలక మౌనం నా భాష అయినపుడు ,

రెప్పలు నిశ్సబ్దంగా ...కన్నీరు

ఒలికించినపుడు,

నేననే నిస్తేజం ...నన్నొదిలి వెల్లిపోతానన్నపుడు,

అప్పుడే ...సరిగ్గా అప్పుడే ...,

నేనున్నానంటూ ...నీవు నా గుండె గది తడతావ్ !

వెన్నెలంత చల్లని నవ్వుతో ,

గతాన్నంతా తోడి , నా హృదయాన్ని జ్ఞ్యపకాల్తో తడిపేస్తావ్!

ఈ రోజెంత నిజమో ??నిన్నటి నీ జీవితం అంతకంటే నిజం అని

నిరూపిస్తావ్ !

నీదిగా నిండిన స్వేచ్ఛావాయువుల చల్లదనం ...

ఇంకా నీతోనే ఉందంటావ్ !

మరిపిస్తావ్ ! మురిపిస్తావ్ !!

నిజాలని నమ్మమంటావ్ !!

నిన్ను నీవు వదలొద్దు అంటావ్ !!

కానీ ...,

కానీ ...,

ఒక్కటి మాత్రం ఎప్పటికి చెప్పవ్ !

ఆ రోజులు మరలా తిరిగి వస్తాయని ....

మరిన్ని జ్ఞ్యపకాలై ,నాలో మిగులు తాయని !!!!!,,





16 మే, 2011

నిన్నటి కల...


"నిన్నటి కల నిజమై .... ముంగిట నిలిచింది !
నిశ్శబ్దాన్ని జయించి , చైతన్య శంఖారావం పూరించింది !
నిస్తేజం రెక్కలు విదిల్చి ,నూతన ఉత్సాహం పుంజుకుంటోంది !
నిదురించిన ఆశలు, చైతన్య విహంగాలయినవి.
నేననే పదం కొత్త అర్ధాలు వెతుక్కుంటోంది .
చీకటి చారలు వెనుక .......ఏదో కొత్త ఉత్సాహం నాకోసం
ఎదురుచూస్తోంది
.
నిన్నటి కల నిజమై , కలతలేని రాత్రులకు నాంది పలికింది.
ఆనందం అంచులను తాకుతోంది.,,

21 ఏప్రిల్, 2011

నా భావాలు..!!


"మనసు మూసుకున్నవేళ ..భావుకత్వానికి చోటెక్కడిది ??? మేఘాలు నిండిన అంబరాన...నిర్మలత్వానికి తావెక్కడిది ??? నీలో రగిలే జ్వాలలని నీవే గుర్తించ నపుడు ..అస్తిత్వానికి అర్ధమెక్కడిది???,,

"సమస్యని విశాల హృదయంతో చూస్తే... దానికి ఎంత తీవ్రత ఉన్నా ,
నీటి తుంపరలా.... కనిపిస్తుంది !,,

"నిశ్శబ్దంలో నవ్వుల రత్నాలు పండించు ,
నీ అంత కోటీశ్వరుడు ఎవరీలోకంలో ??,,

"నేననే అహాన్ని జయించు ... కోటాను కోట్ల మందిలో ,
మనమెంత అల్పులమో అర్ధం అవుతుంది .,,

"జీవితాన్ని జయించిన వారితో పోల్చిచూడు ,
మన బ్రతుకు విలువెంతో తెలుస్తుంది .,,

"నిన్ను కదిలించ గలిగే శక్తి నీలోనే ఉంది .
చేయాల్సిందల్లా... దాన్ని గుర్తించడం మాత్రమే !!,,

"నిదురలేని రాతురలకు తెలుసు జీవితపు బరువెంతో ??
ఎగిసిపడే కెరటాలకు తెలుసు సంద్రం లోతెంతో !!,,




28 మార్చి, 2011

ఈ ఉదయం...!!


" ఉదయం ఎంత అందంగా ఉంది !!
మనసుకి అద్దం లాగా కనిపిస్తోంది .
నిర్మలత్వాన్ని ఆవిష్కరిస్తానంటోంది.
వెండి మబ్బులను తొలగించి ప్రశాంతం ప్రసాదిస్తానంటోంది.
ఎర్రని సూర్యబింబం నా ఆత్మలా గోచరిస్తోంది .
నిన్న లేని ఏదో శక్తి నాలో చేరినట్టుగా తోస్తోంది .
ప్రకృతి పులకింతలు మనసులో కదలికలు తెస్తోంది .
నిన్నటి జ్ఞ్యపకాలు తుడిచేసి, కొత్తగా ఏదో రాస్తున్నట్టుగా ఉంది.
నీ రెండల చల్లదనాన్ని , తొలి చినుకుల పారవశ్యాన్ని అనుభూతించ మంటోంది .
ఉదయం అందం గా వుంది .
నాలో నూతనత్వాన్ని పరిచయం చేస్తోంది!!!!!!!!!,,

14 ఫిబ్రవరి, 2011

ప్రేమించే రోజు !!!


"ప్రేమకి రోజా ????.............సిగ్గుచేటు !!!
ఎన్ని రోజులనైన .... నింపే ప్రేమ , ప్రతి హృదయంలోనూ ఉంటుంది !!
"
అది మనకే తెలీక పోవచ్చు !
దానిని తట్టిలేపే అందమైన మనసుండాలి !
ఎదుటి వారినుంచి దానిని అందుకో గలిగే హృదయం వుండాలి !!
భార్య , భర్త , తల్లి ,తండ్రి ...స్నేహితులు .....ఎలాంటి సంభందం ఐనా ...
దీనికి అతీతం కాదు .
అందర్నీ ప్రేమించు !!...ఎదుటివారి మనసెరిగి ప్రేమించబడు!!
ప్రయత్నిద్దాం ..... ప్రేమని ఆస్వాదిద్దాం !!
ఇలాంటి అందమైన ప్రేమించే రోజులిక మనవే !
ప్రతిరోజూ
!!!!!!!!,,


7 ఫిబ్రవరి, 2011

ఒక్కసారి ఆలోచిద్దాం !!


"నిన్న రాత్రి వస్తూ చూసాను .
మాయా మర్మం ఎరుగక , రోడ్డు పక్కనే నిద్రిస్తున్న వలసొచ్చిన ప్రాణాలు !
దేనిని నమ్ముతారో ?.....ఎంత దూరం పోతారో ?
పొట్ట చేతబట్టుకుని జీవన సంచారం చేస్తారు .
తామో గుంపుగా ....తమదో రాజ్యం గా ......
ప్రపంచపు రాజకీయ , సామాజిక విషయాలు తమ కవసరం
లేనట్టు .........అక్కడో పేటని నిర్మించుకుంటారు .
అంతా ఒకటిగా ........ఒకే కుటుంబంగా .......
అందరిదీ ఒకటే కష్టంగా మసలుతారు !!
ఎండ బాధకానీ ....చీకటి భయం కానీ ....
వర్షపు బురద కానీ .....చలికానీ ...
వారికేం వున్నట్టు అనిపించదు .
ఉన్నదల్లా ఒక్కటే ........ఆకలి !!
చేయాల్సిందల్లా ఒక్కటే .....
జానెడు పొట్ట నింపుకోవడం !!
తెలిసిందల్లా ఒక్కటే ....ప్రతి రోజు వాళ్ళదిగా బ్రతకడం !!
రేపటి ప్రయాణం ఎక్కడికో ????
తిరిగి గుడారాలు, ప్రాంతాన్ని శుభ్రపరచి వెలుస్తాయో??
ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ...ఆశే ఉండదేమో ??
పట్టుపరుపులు , పన్నీటి జల్లుల కలలు కూడా రావేమో ??
సమాజంలోని మార్పులతో వారికేం పని లేదేమో ??
ఇలాంటి ప్రజలు కూడా వున్నారని ...ఉంటారని ,
ఒక్కసారి ఆలోచిస్తే ....బహుసా మనకు
మన సమస్యల కన్నా జీవన పోరాట సమస్యలున్నాయ్ అనిపిస్తుందేమో ???
ఒక్కసారి ఆలోచిద్దాం !!!!!!!!!!,,