28 మార్చి, 2011

ఈ ఉదయం...!!


" ఉదయం ఎంత అందంగా ఉంది !!
మనసుకి అద్దం లాగా కనిపిస్తోంది .
నిర్మలత్వాన్ని ఆవిష్కరిస్తానంటోంది.
వెండి మబ్బులను తొలగించి ప్రశాంతం ప్రసాదిస్తానంటోంది.
ఎర్రని సూర్యబింబం నా ఆత్మలా గోచరిస్తోంది .
నిన్న లేని ఏదో శక్తి నాలో చేరినట్టుగా తోస్తోంది .
ప్రకృతి పులకింతలు మనసులో కదలికలు తెస్తోంది .
నిన్నటి జ్ఞ్యపకాలు తుడిచేసి, కొత్తగా ఏదో రాస్తున్నట్టుగా ఉంది.
నీ రెండల చల్లదనాన్ని , తొలి చినుకుల పారవశ్యాన్ని అనుభూతించ మంటోంది .
ఉదయం అందం గా వుంది .
నాలో నూతనత్వాన్ని పరిచయం చేస్తోంది!!!!!!!!!,,

1 కామెంట్‌:

  1. నాలుగు చినుకులు పడితే చాలు.. !
    బండ రాయి మీద కూడా.
    పచ్చని మొక్కలు మొలుస్తాయి.
    చుట్టూ కన్నీరు కాలువలై పారుతున్నా,
    మనిషి గుండె మాత్రం చెమ్మగిల్లదు.
    అవును అది బండ రాయి....ఇది మనిషి గుండె.

    రిప్లయితొలగించండి