29 అక్టోబర్, 2010

నిన్న ...నేడు .....రేపు !!!


"రేపటి రోజందం రేపటికంటే......రోజు ఊహల్లో
బావుంటుంది ......!!
గడచిన రోజందం జ్ఞ్యపకంగా ఊరక
బావుంటుంది !!
నేడు మాత్రం నిన్నటికి ...రేపటికి వంతెనలా
బావుంటుంది !!!!!,,

22 అక్టోబర్, 2010

రావూరి భరద్వాజ్ (నాకు నచ్చిన రచయిత )


బహుశా......మన జీవితాలని ప్రభావితం చేసే వ్యక్తులు ఏ వయసులోనైన ....ఎదురు కావచ్చనుకుంటా!!
పదిహేనేళ్ళ వయసులో ...నే చదివిన పదాలు , నాకు నచ్చిన రచయత !!
రాసేవి రెండు వరుసలైన ......అందులోని భావం, మనసుని మెలిపెట్టడం ఖాయం !!

" తలదించుకోకు నేస్తం ....
నీ చూపులు నేలకు తగిలి ఆగిపోతాయ్ !!
పైకి చూడు .......
అవి అనంత విశ్వం లోకి జొరపడతాయ్ !!!!,,

ఈ నాలుగు వరుసలే ఇప్పటివరకు చాలా అర్ధాలు నేర్పించాయ్!!
గుర్తుచేసుకున్నపుడల్లా ఒక్కో కొత్త భరోసాని అందిస్తాయ్!!

"ఓ చెట్టుని, పిల్ల మొక్క అడిగిందట ...
ఈ మనుషులకి నీ పువ్వులిచ్చేసావ్ ! కాయలిచ్చేసావ్ !
ఆకులిచ్చేసావ్ ! కొమ్మలిచ్చేసావ్ !
ఆఖరికి నీ మొండెం కూడా ఇచ్చేస్తున్నావ్ !!
నీకోసం నువ్వేం మిగుల్చుకుంటావ్?? అని ,
నేనేం యిస్తే అవన్నీ తిరిగి భగవంతుడు నాకు ఇస్తాడని ,
మరల నేను పది మందికి ఇవ్వచ్చనే నా ఆశ అందిట !!!!!!!!!!
,,
ఎంత అద్భుతమైన భావం ఇంత చిన్న కవితలో !!!
అందరూ అద్భుతంగా రాయగలరు .
కానీ,
హృదయాన్ని హత్తుకునేలా రాసేవారు కొందరే !!!
వారంతా గొప్పవారు ,మహానుభావులు !!
విచిత్రం ఏంటంటే ..............,
వారేం ఆశించి రాయరు.
ఈ డబ్బు ,బిరుదులూ ,సన్మానాలతో వారికి పనిలేదు .
కేవలం అభిమానిచడం తప్ప !!!
భగవంతున్ని ఒక్కటే కోరుకుంటాను ...అలాంటి వారి వయస్సు పెంచకుండా.....
ఇక అపెయ్యమని !!!!



9 అక్టోబర్, 2010

నా స్మృతి పధంలో..........టైటానిక్!!


"జీవితంలో కొన్ని జ్ఞ్యపకాలు .....కొంతమంది మనుషులు ......కొన్ని సినిమాలు ......
అంతత్వరగా హృదయాన్ని వదిలి పోవన్నది నమ్మాల్సిననిజం !!
అలాంటి నా స్మృతి పధంలో .....
టైటానిక్ అద్భుతమైన ప్రేమ కావ్యం !!
ఒకరికోసం ఒకరు బ్రతకాలనే ప్రేమ !!
నేనున్నానన్న భరోసా !!
ఒక్క ప్రేమికుడు మాత్రమే ఇవ్వగలడు అన్నది నిజం !!
విధి పురివిప్పి తాండవిన్చినట్టు,
ప్రేమ అఘాదంలో జారిపోతున్నట్టు ,
బ్రతుకులు మసిబారిపోతున్నట్టు ,
సినిమా అంతా నిజమేమో ???
నిజమంతా సినిమా నేమో ??
తన ప్రేయసిని వదిలి జారిపోతున్న చెయ్యి ....
ఎన్ని కన్నీటి కధలకు ముగింపో????
టైటానిక్ మరువలేని .........
మరిచిపోలేని ....ఓ
అద్భుతమైన ప్రేమకావ్యం!!!!!!!!!!,,


6 అక్టోబర్, 2010

నా బాల్యం


"బాల్యం ఎపుడూ పాత సినిమాలా ఉంటుంది ఏంటో నాకు ???????
ఇసుక తిన్నెలపై పరుగులు ,
వచ్చీరాని మాటల మూటలు,
ప్రకృతి ఒడిలో పసితనపు కేరింతలు ,
బొమ్మల పెళ్ళిళ్ళ సంబరాలు ,
కాలువలో ఈతలు,
జ్ఞ్యపకాల గదిలో నిద్రిస్తున్న ఆల్చిప్పలు ,
కాగితాల మధ్య దాచుకున్న నెమలీకలు,
అలకలు .................బుజ్జగింపులు ,
ఆకతాయిపనులు,
క్షణం తెలీదు అవింత అమూల్యం అని,
రోజు గడిచే కొద్దీ వాటిలో అందం మరింత పెరిగి మెరిపిస్తోంది !!!
రెప్పల మధ్య తడి చేసి పోతోంది !!!
అది ఆనందమో .....మరింత దూరం అవుతున్నాయన్న బాధో ?????
నా వర్ణనకి అందదు ఎప్పుడూ!!
నాకో వరం ఇస్తానంటే ....మాత్రం ,
ఒక్కసారి నా బాల్యంలో వదల మంటాను !!!!!!!!!!!!!!!!!,,

4 అక్టోబర్, 2010

నీవు నన్ను చూసిన క్షణం .......


"ఉన్నట్టుండి క్షణం నాకెందుకో అపురూపం అవుతుంది !
స్మృతుల సెలయేటిలో మధురతరంగం ఎగిసిపడి మనస్సులో మౌనంగా నిక్షిప్తమౌతుంది!!
కాలం కొలిమిలో కరిగిపోతూ .... ఆశల చెలిమితో ఒదిగిపోతూ....
రోజూ లాగే ఎదురుచూసే నా హృదయం,
నీ చూపు కనపడగానే .......నీ స్వరం వినపడగానే ................,
రివ్వున ఎగిరి నీ ముందు ప్రత్యక్షమౌతుంది!!!
అప్పుడే .......సరిగ్గా అప్పుడే ,
నీవు క్రీగంట నన్ను చూసిన క్షణం ....
నాకు అపుతూపమౌతుంది !!
జగాన్ని జయించిన విజయగర్వ మౌతుంది !!!
మధుర తీరాన్ని స్పర్శించిన ...
ప్రణయ తరంగ మౌతుంది !!!!!!!!!!!!!!!!
,,