13 డిసెంబర్, 2010

రావూరి వారి రమ్యత !!


"బాగా అలిసినట్టు కనబడుతున్నవే ?? అన్నాడతను నిద్ర వైపు చూస్తూ ......
అవును బాబుగారు మీరన్నది నిజమే !!
బాగా అలిసిపోయాను .
అతనికి కాస్త విశ్రాంతి నిద్దామని, నేను అతని దగ్గరికి వచ్చాను .
అతనూ , నన్ను ఆహ్వానించాడు .
నేనో చిన్న కలని అతనికి బహూకరించాను .
కల నిండా అతనో పుణ్యమూర్తిని ప్రతిష్టించు కొన్నాడు .
ఆమెను ఆరాధిస్తున్నాడు.
అతని భక్తి చూసాక నాకే జాలి వేసింది.
నేను కదిలితే కల చెదురుతుంది.
కల చెదిరితే , పుణ్యమూర్తి రూపు మాసిపోతుంది .
అలా జరిగితే , అతనెంత క్షోభించేదీ ఊహించుకొని ,
అలానే ఉండిపోయాను !!
అన్నదా...........నిద్ర ఆవలిస్తూ....!!!!,,

4 డిసెంబర్, 2010

విషాదగీతం......!!


"నిశ్సబ్దంగా .....అతి మెల్లగా ఎవరో రాగం ఆలాపిస్తున్నట్టుంది!!
రాళ్ళని కరిగించేలా ..............
కరుడు
కట్టిన కారుణ్యాన్ని కదిలించేలా .........వినిపిస్తోంది !!
జీవితపు భారం పల్లవిగా ..........
సంఘటనల
సమాహారం ...చరణాలుగా అనిపిస్తోంది !!
కటిక చీకటిలో ........కురులు విడదీసి ,
కన్నీటి
చరమాంకం పాడుతున్న ... శోకదేవతని తలపిస్తోంది !!
సాగరంలో ......ఎగిసిపడి కనుమరుగైపోయే .. కలలా కానవస్తోంది !!
ఎదుట నిలిచి నీవెవరు అని అడిగాను ??
చురక లాంటి పెదవి విరుపుతో చెప్పింది .........
గుర్తించలేదా
?????నన్ను ....
నేనే ............
నీ అత్మనంది!!!!!,,