"ఈమె గుర్తుందా ???వన్నెల పడవమీద గోదారి దాటిన మల్లెతీగే !!!వాసంతాలు వెళ్ళిపోయాక మల్లెలు వాడి ....తీగ మిగిలింది .ఒంగి చూడు వాసనా కైనా గుర్తుపడతావేమో ????"" తీగలని కదల్చకూడదు .... శ్రుతి చేయాలి .ఏవి ఎలా వాడాలో తెలీకుండా ఉపయోగించడం నేరం !! ,,"నిన్నటి పెదాల తీయదనం నేడు ఎక్కడవుంది??? నిజానికి అప్పటి తీయదనం కూడా పెదాలది కాదు ,హృదయాలది .మరి నేడు ???? ,,"బరువెక్కిన కవితా హృదయం బద్దలయితే ,కన్నీటి కుండల్లాంటి కవితలయ్యాయి . ,,"తెలుగందం !తెలుపందం !!నిలబెట్టే తెలుగుపిల్ల మరింత మకరందం !!!,,
నా కవితలు.. ........my poetry..........!!!
31 అక్టోబర్, 2014
గాలి బుడగలు
30 అక్టోబర్, 2014
22 ఆగస్టు, 2013
సమైక్యాంధ్ర
సంతానం ఎంతమందైనా ...... ఎలాంటి వ్యక్తిత్వంతో ఉన్నా ....
రూపురేఖలలో తేడాలున్నా ....
భావాల్లో భేదాలున్నా ... ,
అందరి రక్తం ఒక్కటే ! ఒక్క తల్లి కన్నదే !
ఆ తల్లి బిడ్డలు గానే ప్రపంచం గుర్తిస్తుంది .
ఒకడు కష్టపడ్డాను ,ఆటుపోటులు ఎదుర్కొన్నాను వేరే పోతానంటే ,
కలిసి వుండు నాయనా అందరూ తోడుంటారని చెప్తుంది .
"తెలుగుదనం" అందరినీ ఒక్కటిగా వుండమంటుంది .
అన్ని జిల్లాల గొప్పదనాలు కలిపి నిలబెట్టి ,
ఖ్యాతి సంపాదించిన నేలని ఎవరి ముక్క వారిదే అని ఎలా పంచుకోగలం ??
చిన్ననాటి కధలా ... పదికట్టెల మోపుకన్నా ..కట్టె ఒక్కటిగానే సులువుగా విరుగుతుంది .
"సమైక్యవాదం" దగ్గరతనం తెస్తుంది .
అందరం కలిసుందాం !
అవసరాలు కలిసి పంచుకుందాం !
కస్టాలు ఎదుర్కొని కలిసి నిలబడదాం !
ప్రపంచానికి తెలుగు ఒక్కటే !
తెలుగుదనం ఒక్కటే అని చాటిచెబుదాం !!!!!!
21 మార్చి, 2013
తెలుగుని కాపాడుకుందాం
____మన భావం !
____మన బాధ !
____మన భాధ్యత !!!
ఎందరో మహానుభావుల చరిత్ర మనది !
ఎందరో అనుభవాలను, భావాలను పంచుకున్న భాష మనది !
ఎన్నో ప్రయోగాలను, కీర్తిని ,ఖ్యాతిని గడించిన జాతి మనది !
ఎన్ని భాషల్లో ప్రావీణ్యం సంపాదించినా .....
భాధ ,ప్రేమ ,సానుభూతి సొంత భాషలో కన్నా మధురం ఉంటుందా ??
భాషను ప్రేమిద్దాం !
భావాలను వ్యక్తీకరింద్దాం !
____మన బాధ !
____మన భాధ్యత !!!
ఎందరో మహానుభావుల చరిత్ర మనది !
ఎందరో అనుభవాలను, భావాలను పంచుకున్న భాష మనది !
ఎన్నో ప్రయోగాలను, కీర్తిని ,ఖ్యాతిని గడించిన జాతి మనది !
ఎన్ని భాషల్లో ప్రావీణ్యం సంపాదించినా .....
భాధ ,ప్రేమ ,సానుభూతి సొంత భాషలో కన్నా మధురం ఉంటుందా ??
భాషను ప్రేమిద్దాం !
భావాలను వ్యక్తీకరింద్దాం !
మన పిల్లలకి మన గుణాలు ,బుద్ధులు ,ఆస్తులు ,
రోగాలు ,ఆచారాలు అందించినట్టే భాషను కూడా అందిద్దాం !
రోగాలు ,ఆచారాలు అందించినట్టే భాషను కూడా అందిద్దాం !
అదీ మన భాధ్యతే నని గుర్తిద్దాం !!
తెలుగుని కాపాడుకుందాం !!!!!
తెలుగుని కాపాడుకుందాం !!!!!
8 జనవరి, 2013
జీవితం
జీవితం గతాన్ని చూస్తూ ...భవిష్యత్ కి ప్రయాణం చేస్తూ ...వర్తమానాన్ని గడుపుతున్నట్టు వుంటుంది.
కాని ఒక్కటి నిజం....
గతాన్ని మార్చలేం ......అవి జ్ఞ్యాపకాలు .
భవిష్యత్ ని లిఖించలెమ్ ...అవి నుదిటి రాతలు.
నువ్వు వేసే అడుగే వర్తమానం....చూసుకుంటూ ...సరిచేసుకుంటూ ..వెయ్ !!! అంతే !
గతం జ్ఞ్యపకం లా కాక అనుభూతిగా మిగులుతుంది.
భవిష్యత్ రాత గా కాక ....ఆశగా గోచరిస్తుంది.
26 ఆగస్టు, 2011
నీ వొస్తావ్ ..!!
"గుండె బాధతో నిండినపుడు ,
మాట పెగలక మౌనం నా భాష అయినపుడు ,
రెప్పలు నిశ్సబ్దంగా ...కన్నీరు
ఒలికించినపుడు,
నేననే నిస్తేజం ...నన్నొదిలి వెల్లిపోతానన్నపుడు,
అప్పుడే ...సరిగ్గా అప్పుడే ...,
నేనున్నానంటూ ...నీవు నా గుండె గది తడతావ్ !
వెన్నెలంత చల్లని నవ్వుతో ,
గతాన్నంతా తోడి , నా హృదయాన్ని జ్ఞ్యపకాల్తో తడిపేస్తావ్!
ఈ రోజెంత నిజమో ??నిన్నటి నీ జీవితం అంతకంటే నిజం అని
నిరూపిస్తావ్ !
నీదిగా నిండిన స్వేచ్ఛావాయువుల చల్లదనం ...
ఇంకా నీతోనే ఉందంటావ్ !
మరిపిస్తావ్ ! మురిపిస్తావ్ !!
నిజాలని నమ్మమంటావ్ !!
నిన్ను నీవు వదలొద్దు అంటావ్ !!
కానీ ...,
కానీ ...,
ఒక్కటి మాత్రం ఎప్పటికి చెప్పవ్ !
ఆ రోజులు మరలా తిరిగి వస్తాయని ....
మరిన్ని జ్ఞ్యపకాలై ,నాలో మిగులు తాయని !!!!!,,
16 మే, 2011
నిన్నటి కల...
"నిన్నటి కల నిజమై .... ముంగిట నిలిచింది !
నిశ్శబ్దాన్ని జయించి , చైతన్య శంఖారావం పూరించింది !
నిస్తేజం రెక్కలు విదిల్చి ,నూతన ఉత్సాహం పుంజుకుంటోంది !
నిదురించిన ఆశలు, చైతన్య విహంగాలయినవి.
నేననే పదం కొత్త అర్ధాలు వెతుక్కుంటోంది .
చీకటి చారలు వెనుక .......ఏదో కొత్త ఉత్సాహం నాకోసం
ఎదురుచూస్తోంది .
నిన్నటి కల నిజమై , కలతలేని రాత్రులకు నాంది పలికింది.
ఆనందం అంచులను తాకుతోంది.,,
నిశ్శబ్దాన్ని జయించి , చైతన్య శంఖారావం పూరించింది !
నిస్తేజం రెక్కలు విదిల్చి ,నూతన ఉత్సాహం పుంజుకుంటోంది !
నిదురించిన ఆశలు, చైతన్య విహంగాలయినవి.
నేననే పదం కొత్త అర్ధాలు వెతుక్కుంటోంది .
చీకటి చారలు వెనుక .......ఏదో కొత్త ఉత్సాహం నాకోసం
ఎదురుచూస్తోంది .
నిన్నటి కల నిజమై , కలతలేని రాత్రులకు నాంది పలికింది.
ఆనందం అంచులను తాకుతోంది.,,
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)