22 ఆగస్టు, 2013

సమైక్యాంధ్ర

సంతానం ఎంతమందైనా ...... ఎలాంటి వ్యక్తిత్వంతో ఉన్నా .... 
రూపురేఖలలో తేడాలున్నా ....
భావాల్లో భేదాలున్నా ... ,
అందరి రక్తం ఒక్కటే ! ఒక్క తల్లి కన్నదే !
ఆ తల్లి బిడ్డలు గానే ప్రపంచం గుర్తిస్తుంది . 
ఒకడు కష్టపడ్డాను ,ఆటుపోటులు ఎదుర్కొన్నాను వేరే పోతానంటే ,
కలిసి వుండు నాయనా అందరూ తోడుంటారని చెప్తుంది . 
"తెలుగుదనం" అందరినీ ఒక్కటిగా వుండమంటుంది . 
అన్ని జిల్లాల గొప్పదనాలు కలిపి నిలబెట్టి ,
ఖ్యాతి సంపాదించిన నేలని ఎవరి ముక్క వారిదే అని ఎలా పంచుకోగలం ??
చిన్ననాటి కధలా ... పదికట్టెల మోపుకన్నా ..కట్టె ఒక్కటిగానే సులువుగా విరుగుతుంది . 
"సమైక్యవాదం" దగ్గరతనం తెస్తుంది . 
అందరం కలిసుందాం !
అవసరాలు కలిసి పంచుకుందాం !
కస్టాలు ఎదుర్కొని కలిసి నిలబడదాం !
ప్రపంచానికి తెలుగు ఒక్కటే ! 
తెలుగుదనం ఒక్కటే అని చాటిచెబుదాం !!!!!!


4 కామెంట్‌లు:

  1. సోమేశ్వరరావు22 ఆగస్టు, 2013 5:24 AMకి

    ప్రతి అక్షరం నగ్నసత్యం, ఆ చిత్రం ఎంతో అర్ధవంతం.

    రిప్లయితొలగించండి
  2. "చుట్టూ అంతా చెడిపోతోందే"అనేవారే కానీ,మంచి స్పందనకు ప్రతిస్పందన ఈ రోజుల్లో కరువు!మంచి....చెడంత.....గమ్ముని ఎక్కదు జనానికి!కవిత తెనుగింటి ఆడపడుచులా ఉంది!

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. kadupuki panikiraani sunnam kanna...anname melani eppatiki telusukuntaru?
      vidipodam prati samasyaki pariskaram kadani ardham chesukondi.

      తొలగించండి