8 సెప్టెంబర్, 2010

ఆణిముత్యం


"నీ పేరు పెదవి పలికినా .........., నీ తలపు క్షణం నా తలుపు తట్టినా ......., నీ జ్ఞ్యపకాలు ఎపుడు వర్షించినా.........., నీ గురించి ఎవరు ప్రస్తావించినా ............., నీకు నచ్చినవి ఎపుడు ఎదురైనా........., నిమిషాలన్నీ అతి అపూర్వం !! ఆణిముత్యం నాకు !!!!,,

తియ్యని జ్ఞ్యపకమా........


నువ్వు నన్నలరించే కలవైతే ........జీవితాంతం నిద్రలోనే ఉండిపోవలనుకున్న!!
నువ్వు నన్ను ఆనందింపచేసే నిజమైతే ..........ఆ జన్మాంతం అనిమేషంగా
నిన్నే చూస్తున్డిపోవాలనుకున్న !!!
కానీ ,
కలవూ కాక ,.......నిజమూ కాక ,
అందరాని చందమామలా ఉండిపోయావ్ !!
ఊహాగా మారి అనుక్షణం భాదిస్తున్నావ్ !!
నా తియ్యని జ్ఞ్యాపకమా ..........
ఎందుకిలా మిగిలావ్ ??????

అనురాగం


"రెప్పల మధ్య స్వప్నానికి , మాటల మధ్య భావానికి , పువ్వుల మధ్య సుగంధానికి, రెండు మనసుల మధ్య మమతకి , కొంత నిశ్శబ్దం కావాలి !!! అపుడే రాగం మొదలవుతుంది !! అదే అనురాగమై .............వారధి నిర్మిస్తుంది !!!!!!!!!!!!!,,

ప్రేమలేఖ


"మనసుకి ...........అద్డం పట్టేలా ............,
అందమైన భావాల విరితోటలా.................,
కధలా ..........కవితలా ........కావ్యంలా .........,
రమ్యంగా ............రమణీయంగా ...........,
దూరాన్ని దగ్గర చేసే వంతెనలా ..............,
ప్రతి పదంలో ప్రేమని నింపి,
ప్రతి వరుసలో హృదయాన్ని కదిపి ,
నేను నీకు దూరంగా లేను అనేంతగా ........,
దగ్గర తనం ప్రతిబింబించేలా ...........ఉండాలి
అందాల ప్రేమలేఖ !!!!!!!!,,

6 సెప్టెంబర్, 2010

నా అనుభందం గత సంవత్సరంతో..........!!!!


"పరుగెడు తున్న .....నిన్నాపలేను !!!
నీ అంత వేగం నాకు లేదు కనుక .
నిస్తేజంగా ........ఉండలేను నీ వెళ్తుంటే ...........
అనుబందం పెనవేసుకున్నాను కనుక !!!
నిశ్శబ్దంగా ...........కన్నీరు కార్చలేను !
నువ్ అందించిన ఆనందం అమూల్యం కనుక!!!
పగలబడి నవ్వలేను !!
తిరిగేప్పటికి రావు కనుక !!
సిగ్గుతో తెరమాటున దాగలేను !!
నిన్ను సాంతం చూసాను కనుక !!
అగ్నిలా రాజుకుంటూ మొదలై .................చల్లని మంచు ముద్దలా దూరం
అవుతున్న ............. వత్సరమా???
ఇంకెలా సాగానంపను నిన్ను ???????,,

అందాల అపరంజి .......నీ వెవరు?????


"నీ వెవరు ??????నీ వెవరు??????
అందాల అపరంజి , నిన్నెక్కడ చూసాను ??????
నల్ల్లని కళ్ళు..........,
ఎర్రని పెదవులు ...........,
పొడుగాటి జడ ............,
మువ్వల అందెలు ......,
పరదాల మాటున .........దాగిన నీ అందం .........ఎక్కడ చూసాను ?????
నీ బొమ్మ గీస్తూ........రంగులద్దబోయి .......నా హృదయములో ఒలకపోసుకున్ననా???
అవి మచ్చలై .......మరకలై .............జ్ఞాపకాలై .........
గుండెను ఒదిలి పోనంటున్నాయ్!!!!!
రాగినివా????
రాగానివా????
నెలవంకవా???
సిగమల్లెవా?
నిన్నేమని వర్ణించను???
నా హృదయంలో..................రాణివి ............దేవేరివి !!
నీ మేలి ముసుగు తీయకు ................
అంత అందం చూడలేను !!
నీ క్రీగంటి చూపుకే .................దాసోహం ఏమో నేను !!!!!!,,

నా కవిత ...........


"వెన్నెల రాత్రి నిండు చందమామ అంత నిర్మలమైనది.....
నా కవిత !!!!
తొలకరి చినికులకు........పుడమి పులకింతల ......కమ్మదనమే......
నా కవిత !!!!
ఆవేశంతో .......ఎగిరి ......పొంగి.....చల్లబడి ఇంకిపోయే సంద్రం నురుగంత తెల్లనిది .........
నా కవిత !!!!
తొలిముద్దు పారవశ్యపు.......మధుర మైన అనుభూతి లాంటిది ........
నా కవిత !!!!!!!!!!
జీవితపు అద్దం మీద ఐన కన్నీటి చారికల నలుపే ...............
నా కవిత !!!!!
వేదనా తరంగాల పురిటినొప్పుల ఫలితమే ...................
నా కవిత !!!!!
భాదని .....కోపాన్ని .......గాయాన్ని .......గతాన్ని ........
కన్నీటిని మింగేసి ,
నిర్మలత్వాన్ని ......ఘాంభిర్యాన్ని......ఓదార్పుని......ప్రేమని .....
అందించేదే ...................నా కవిత !!!!!!!!!!!!!!!,,