21 ఏప్రిల్, 2011

నా భావాలు..!!


"మనసు మూసుకున్నవేళ ..భావుకత్వానికి చోటెక్కడిది ??? మేఘాలు నిండిన అంబరాన...నిర్మలత్వానికి తావెక్కడిది ??? నీలో రగిలే జ్వాలలని నీవే గుర్తించ నపుడు ..అస్తిత్వానికి అర్ధమెక్కడిది???,,

"సమస్యని విశాల హృదయంతో చూస్తే... దానికి ఎంత తీవ్రత ఉన్నా ,
నీటి తుంపరలా.... కనిపిస్తుంది !,,

"నిశ్శబ్దంలో నవ్వుల రత్నాలు పండించు ,
నీ అంత కోటీశ్వరుడు ఎవరీలోకంలో ??,,

"నేననే అహాన్ని జయించు ... కోటాను కోట్ల మందిలో ,
మనమెంత అల్పులమో అర్ధం అవుతుంది .,,

"జీవితాన్ని జయించిన వారితో పోల్చిచూడు ,
మన బ్రతుకు విలువెంతో తెలుస్తుంది .,,

"నిన్ను కదిలించ గలిగే శక్తి నీలోనే ఉంది .
చేయాల్సిందల్లా... దాన్ని గుర్తించడం మాత్రమే !!,,

"నిదురలేని రాతురలకు తెలుసు జీవితపు బరువెంతో ??
ఎగిసిపడే కెరటాలకు తెలుసు సంద్రం లోతెంతో !!,,




3 కామెంట్‌లు:

  1. బావున్నాయండీ కవితలు.ఫోటోలను బాగానే ఉపయోగించుకున్నారు.ఈప్రక్రియ ౩ దశాబ్దాల
    క్రిందట కిరన్ ప్రభ గారు వివిధ పత్రికల్లో ప్రయోగించారు

    రిప్లయితొలగించండి
  2. వరాల మూటగట్టు ఈ పదబంధాలు,
    తరాల దాకా నిలుస్తాయి

    రిప్లయితొలగించండి